: ‘జగన్ విద్రోహ శక్తిలా మారాడు’.. వైసీపీ అధినేతపై మండిపడ్డ ఏపీ మంత్రులు
ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఈరోజు ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి జగన్ అడ్డంకిలా మారాడని అన్నారు. ఏసీ రూమ్ నుంచి బయటకు రాని జగన్‌కు ప్రజల కష్టాలు, రాష్ట్రాభివృద్ధి అంశాలు ఎలా తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు. వైసీపీకి భవిష్యత్తులో డిపాజిట్లు కూడా దక్కవని మంత్రి దేవినేని అన్నారు. రాష్ట్రానికి జగన్ విద్రోహ శక్తిలా మారాడని ఆయన విమర్శించారు. పోలవరానికి అడ్డుపడే ప్రయత్నాలను జగన్ మానుకోవాలని సూచించారు.