: సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంటే...ప్రధాని లండన్ లో ఎంజాయ్ చేస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
యూరీ ఘటన అనంతరం సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధవాతావరణం నెలకొంటే ప్రధాని నవాజ్ షరీఫ్ లండన్ లో హాలీడే ఎంజాయ్ చేస్తూ షాపింగ్ కు వెళ్లారని పాకిస్థాన్ ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తూర్పు సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొన్న దశలో ప్రధాని విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు.