: 'సాక్ష్యాలు సాక్ష్యాలు' అంటున్నారుగా...ఇవిగో...!: పాక్ రాయబారికి అందజేసిన జైశంకర్


యూరీ సెక్టార్ ఘటనపై సాక్ష్యాలు లేవని ఒకసారి, ఆయుధాలు పాకిస్థాన్ వైనంత మాత్రాన ఉగ్రవాదులు పాకిస్థాన్ వారనేందుకు సాక్ష్యాలేంటి? అని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పదేపదే అనడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్, పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్ ను రాయబార కార్యాలయానికి పిలిపించుకుని, యూరీ ఘటనపై సాక్ష్యాలను అందజేశారు. నలుగురు ఉగ్రవాదులు యూరీ సెక్టార్ పై దాడులు జరిపారని, వారికి పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు చెందిన ఫైసల్ హుస్సేన్ అవాన్, యాసిర్ ఖుర్షీద్ లు గైడ్లుగా వ్యవహరించారని, వారిద్దరూ తమ అదుపులో ఉన్నారని ఆయన తెలిపారు. సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్ సహించదని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News