: పాకిస్థాన్ కు మరో దెబ్బ... ఈసారి అబ్బా' అనాల్సిందే!


పాకిస్థాన్ 'అబ్బా' అనేలా మరోదెబ్బ కొట్టేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే నదీ జలాలను వినియోగించుకోవడం ద్వారా చావుదెబ్బ కొట్టాలని భావిస్తోందన్న వార్తలతో ఉలిక్కిపడ్డ పాకిస్థాన్ ప్రపంచ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ కు భారత్ లో ఉన్న మిత్రదేశం హోదాను తొలగించే దిశగా మోదీ చర్యలు ప్రారంభించారు. మిత్రదేశం హోదాలో ఇప్పటి వరకు పలు ప్రయోజనాలు, ఆర్థిక లాభాలు పొందుతున్న పాకిస్థాన్ కు, ఇకపై అలాంటి ప్రయోజనాలు పొందే అవకాశం లేకుండా చేయనున్నారు. 1996లో పాకిస్థాన్ కు భారత్ మిత్రదేశం హోదా ఇచ్చింది. అప్పటి నుంచి పాకిస్థాన్ భారత్ తో సమానమైన వాణిజ్యప్రయోజనాలు పొందుతోంది. ఈ హోదా తీసేస్తే, ఆ ప్రయోజనాలతో పాటు, దౌత్యపరమైన ప్రయోజనాలు కూడా తగ్గిపోతాయి. దీంతో పాక్ కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పాక్ ను ఒంటరి చేసేందుకు ఉన్న మార్గాలన్నీ అన్వేషిస్తున్న మోదీ ప్రభుత్వం...దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ఉన్నతాధికారులతో ఈ నెల 29 న సమావేశం నిర్వహించనుంది.

  • Loading...

More Telugu News