: అంపైర్ ను దూషించిన బంగ్లా ఆటగాడికి జరిమానా


అంపైర్ ను దూషించిన బంగ్లాదేశ్ ఆటగాడికి జరిమానా పడింది. అఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డ్ అంపైర్ షర్ఫుద్దుల్లా నిర్ణయంతో విభేదించిన బంగ్లాదేశ్ క్రికెటర్ షబ్బీర్ రెహ్మాన్ డ్రింక్స్ విరామ సమయంలో ఆయనతో వాగ్వాదానికి దిగాడు. ఈ సందర్భంగా అతనిపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశాడు, దీంతో అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం కోతను భారీ జరిమానాగా విధించినట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటనలో పేర్కొంది. అలాగే అతనికి రెండు డీ మెరిట్ పాయింట్లు కూడా ఇస్తున్నట్టు తెలిపింది. డీఆర్ఎస్ లో భాగంగా పలు రూల్స్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పదేపదే అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించమని కోరే అవకాశం ఉందని గుర్తించిన ఐసీసీ ఇలాంటి ఇబ్బంది పెట్టే ఆటగాళ్లకు డీ మెరిట్ పాయింట్లు ఇస్తుంది. రెండేళ్ల వ్యవధిలో వారు సాధించిన పాయింట్లను బట్టి వారికి శిక్ష విధించనుంది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ కూడా పడే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News