: ఇతన్నే పెళ్లి చేసుకోబోతున్నానంటూ ఫొటో పోస్ట్ చేసిన లిసా హేడెన్
‘ఇతన్నే నేను పెళ్లి చేసుకోబోతున్నాను’ అంటూ బాలీవుడ్ హీరోయిన్ లిసా హేడెన్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొంది. ఒక ఎయిర్ పోర్ట్ లో తన లవర్ డినో లాల్వానీ తో లిప్ లాక్ సీన్ లో ఉన్న హేడెన్ ఆ ఫొటోను పోస్ట్ చేసి మరీ, ఈ విషయాన్ని చెప్పింది. కాగా, గతంలో లండన్ లో యూనిసెఫ్ హలోవిన్ బాల్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వాళ్ల చూపులు కలవడం, ఆపై ప్రేమలో పడటం జరిగింది. లిసా హేడెన్ చెన్నైలో పుట్టినప్పటికీ, ఎక్కువ కాలం అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోనే గడిపింది. మోడలింగ్ కోసం ముంబయికి రావడం, ఆ తర్వాత బాలీవుడ్ లోకి ప్రవేశించడం జరిగింది. ఇక, ఆమె లవర్ డినో లాల్వానీ గురించి చెప్పాలంటే... బ్రిటన్ వ్యాపారవేత్త గుల్లు లాల్వాని కుమారుడు. అయితే, గుల్లు లాల్వాని జన్మించింది మాత్రం పాకిస్థాన్ లో. గుల్లు లాల్వానికి బ్రిటన్ లో బినాటోన్ టెలికాం అనే సంస్థ ఉంది. ఈ సంస్థకు డినో లాల్వానీ ప్రస్తుతం చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు.