: పాతబస్తీలో డిస్కో బాబా నుంచి నకిలీ బంగారం బిస్కెట్లు, నకిలీ వజ్రాలు స్వాధీనం
హైదరాబాదులోని బంగారం బిస్కెట్లు, వజ్రాల పేరుతో బురిడీ కొట్టించే డిస్కో బాబా ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... పాతబస్తీలో డిస్కో బాబా పేరిట ఓ వ్యక్తి పలువురిని ఆకర్షించి, గుప్తనిధుల పేరుతో ఆశ కలిగిస్తున్నాడు. గుప్త నిధుల వలలో పడ్డవారికి నకిలీ బంగారం బిస్కెట్లు, నకిలీ వజ్రాలు అంటగట్టి నిలువు దోపిడీ చేస్తున్నాడు. ఈ ముఠాపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో నిఘా వేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు. రెడ్ హ్యాండెడ్ గా 18 మంది సభ్యులుగల ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నకిలీ బంగారం బిస్కెట్లు, నకిలీ వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు.