: టీడీపీ ఎమ్మెల్యేను పరుగులు పెట్టించిన కందిరీగలు
శారదానదిని పరిశీలించేందుకు వెళ్లిన విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ను కందిరీగలు పరుగులు పెట్టించాయి. కసింకోట మండలం నర్సాపురం దగ్గర కోతకు గురైన శారదా నదిని పరిశీలించే నిమిత్తం ఎమ్మెల్యే గోవింద్ వెళ్లారు. ఆయన వెంట రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారు. నదిని పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా కందిరీగలు వారిపై దాడి చేశాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఎమ్మెల్యేను అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. కందిరీగల దాడిలో గాయపడ్డ రెవెన్యూ అధికారులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.