: మత్తెక్కి పడిపోయిన తల్లిని లేపేందుకు ప్రయత్నిస్తున్న మూడేళ్ల చిన్నారి... గుండెల్ని పిండేస్తున్న వీడియో


పాశ్చాత్య దేశాల్లో డ్రగ్స్ ఎంతగా వాడుతారో... అవి వాడితే వచ్చే అనర్థాలేంటో తెలియజెపుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ప్రతి ఒక్కరి హృదయాలనూ ద్రవింపజేస్తోంది. అమెరికాలోని మసాచుసెట్స్ లో 36 ఏళ్ల మహిళ, తన రెండు సంవత్సరాల చిన్నారితో కలసి ఓ స్టోర్ కు వెళ్లిన వేళ, అక్కడ జరిగిన ఘటన తాలూకు దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. సదరు మహిళ తీసుకున్న డ్రగ్స్ ఓవర్ డోస్ కావడంతో కళ్లు తిరిగి పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమె పక్కనే ఉన్న రెండేళ్ల చిన్నారి ఏం చేయాలో తెలియని స్థితిలో తల్లిని లేపేందుకు ఎంతో ప్రయత్నించింది. చేతులు లాగి చూసింది. పక్కనే కూర్చుంది. తల పట్టి లేపేందుకు యత్నించింది. చెంపలపై కొట్టి చూసింది. ఎంతకూ తల్లి లేవక పోవడంతో, ఆపై బిక్కమొహం వేసి వెక్కి వెక్కి ఏడ్చింది. అక్కడే ఉన్న ఓ పోలీసు అధికారి పాప ఏడుపు విని 911కు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఆ మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ పాపను శిశు సంరక్షణ అధికారులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News