: తమిళనాడుకు నీరివ్వాల్సిందేనన్న సుప్రీంకోర్టు... రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారా? అంటూ కర్ణాటకకు చీవాట్లు


కావేరీ నదీ జలాల విషయంలో సుప్రీంకోర్టు నేడు కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో తామిచ్చిన ఆదేశాల మేరకు రెండు రోజుల పాటు రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దిగువకు నీటిని విడుదల చేయలేమని చెప్పిన కర్ణాటక న్యాయవాది వాదనను తప్పుబడుతూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారా? అని చీవాట్లు పెట్టింది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత కర్ణాటకపై ఉందని, శాంతి భద్రతల అంశం కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఈ లోగా ఎంత నీరు తమిళనాడుకు చేరిందో తెలియజేయాలని సూచించింది. ఈలోగా రెండు రాష్ట్రాల మధ్యా సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించాలని అటార్నీ జనరల్ కు సూచించింది.

  • Loading...

More Telugu News