: హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం
హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ కు విరుద్ధంగా వాహనాలు నడిపే వారికి ఇకపై ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే, హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం అయ్యాయి. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా, రెండేళ్ల జైలు శిక్ష కూడా పడుతుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో నెం.80 విడుదల చేసింది. పాయింట్ల రూపంలో పెనాల్టీని లెక్కించనున్నారు. 12 పాయింట్లు దాటితే వాహనదారుడి లైసెన్స్ రద్దుతో పాటు రెండేళ్ల జైలు శిక్ష కూడా పడుతుందని ట్రాఫిక్ అదనపు కమిషనర్ జితేందర్ పేర్కొన్నారు.