: కేటీఆర్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. కూల్చివేతలపై ఆరా


అక్రమ నిర్మాణాల కూల్చివేత ఎంత వరకూ వచ్చిందని మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి అడిగారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఆయన, హైదరాబాద్ లోని నాలాలపై ఉన్న ఆక్రమణల తొలగింపు పనులు ఎంతవరకూ వచ్చాయని కేటీఆర్ ను అడిగి తెలుసుకున్నారు. నాలా స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అవసరమైతే మరింతమంది సిబ్బందిని, కూలీలను నియమించుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో వరుసగా రెండవ రోజూ జరుగుతున్న కూల్చివేతలపై కేటీఆర్ సమాచారం ఇచ్చారు. కాగా నేడు కేసీఆర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News