: గుంటూరు వరద ప్రాంతాల్లో వెంకయ్య ఏరియల్ సర్వే
ఆంధ్రప్రదేశ్లో కురిసిన భారీ వర్షాల ధాటికి అక్కడి పలు జిల్లాలను వరద ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆయా ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విహంగవీక్షణం ద్వారా పరిశీలించారు. తాజాగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా గుంటూరులో వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్సర్వే చేశారు. జిల్లాలోని పెదకూరపాడు, సత్తెనపల్లి నరసరావుపేట, ప్రత్తిపాడు ప్రాంతాలను ఆయన హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. సంబంధిత అధికారులతో చర్చించి వరద ద్వారా తలెత్తిన నష్టం వివరాలను తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న రైల్వే ట్రాక్ మరమ్మతు పనులపై ఆరా తీశారు.