: శునకాలను చంపి.. కట్టెకు వేలాడదీసి వీధుల్లో ర్యాలీ తీసిన కాంగ్రెస్ యూత్ వింగ్


కేర‌ళ రాష్ట్ర‌ కాంగ్రెస్‌(ఎం) యూత్‌ వింగ్ కొట్టాయం జిల్లాలో ఇటీవ‌ల తీసిన ఓ ర్యాలీ వివాదాస్ప‌దంగా మారింది. రాష్ట్రంలో కుక్కలు మ‌నుషుల‌పై చేస్తోన్న‌ దాడులు ఎక్కువవుతున్నాయని, ప్ర‌భుత్వం ఏ మాత్రం పట్టించుకోవ‌డం లేదని ఆరోపిస్తూ, ఐదు శునకాలను చంపేసిన కార్య‌క‌ర్త‌లు అనంత‌రం వాటి మృతదేహాలను కట్టెకు వేలాడదీసి ప‌లు వీధుల్లో ర్యాలీలు తీశారు. నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న ముగిశాక‌ స్థానిక పోస్టాఫీస్‌ ముందు వాటి మృతదేహాలను వదిలేసి వెళ్లిపోయారు. కేంద్ర రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు త‌మ తీరుని మార్చుకోవాల‌ని హెచ్చ‌రించారు. ఆ కుక్కలను తామే చంపేశామ‌ని, కుక్క‌లు చేస్తోన్న‌ దాడులపై ప్ర‌భుత్వాలు చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలే మ‌ళ్లీ జ‌రుగుతాయ‌ని వారు హెచ్చరిక‌లు జారీ చేశారు. ఈ దారుణ ఘటనపై స్థానిక‌ పోలీసులు, ప్రభుత్వం స్పందించక‌పోవ‌డం గ‌మ‌నార్హం. కుక్క‌ల‌ను చంపేసిన వారిపై కేసులు నమోదు చేయలేదు. కొన్ని రోజుల క్రితం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వీధికుక్కలను చంపుతున్న ఘటనలపై స్పందిస్తూ అటువంటి చర్యలకు పాల్పడితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. సీఎం ఈ ప్ర‌క‌ట‌న చేసిన కొన్ని రోజుల‌కే ఆందోళ‌నకారులు ఈ చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు.

  • Loading...

More Telugu News