: హైదరాబాద్‌లో పలుచోట్ల చిరుజల్లులు
హైదరాబాద్ నగరాన్ని వర్షం వీడడం లేదు. భారీ వర్షాల తరువాత కాస్త తేరుకున్న నగర వాసులు ఈరోజు ఉదయం చిరుజల్లులను చూశారు. నగరంలోని చైతన్యపురి, దిల్‌సుక్‌నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక, హబ్సిగూడ, సికింద్రాబాద్, తిరుమల గిరి, కార్ఖానా తో పాటు పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. పలు చోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడడంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించి పంపిస్తున్నారు. హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.