: కొణతాల రామకృష్ణ భార్య గుండెపోటుతో మృతి
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సతీమణి పద్మావతి (54) గుండెపోటుకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమెకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు తొలుత విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిన్న ఉదయం పరిస్థితి విషమించడంతో కేర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. కొణతాల సహా వారి బిడ్డలు, బంధువులు దగ్గరున్న సమయంలోనే ఆమె తుది శ్వాస విడిచారు. పద్మావతి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, ఫోన్లో కొణతాలను పరామర్శించారు. ఆపై ఆయన ఇంటి నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల అశ్రు నయనాల మధ్య అంతిమయాత్ర సాగగా, కొణతాల అంతిమ సంస్కారం జరిపారు.