: నయీమ్ కేసును సీబీఐకి అప్పగించండి.. హైకోర్టులో పిల్ వేసిన సీపీఐ నారాయణ
గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసును సీబీఐకి అప్పగించేలా ఆదేశించాలంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. న్యాయమూర్తితో సంబంధం లేకుండా తానే వాదనలు వినిపించుకునే వ్యక్తి (పార్టీ ఇన్ పర్సన్) హోదాలో నారాయణ ఈ పిల్ వేశారు. సోమవారం కోర్టు ఎదుట హాజరైన ఆయన దీనిని లంచ్‌మోషన్ రూపంలో విచారించాలని కోరారు. నయీమ్ కేసులో పలువురు పోలీసులు, రాజకీయ నేతలకు సంబంధాలు ఉన్నాయని, కాబట్టి దర్యాప్తును సీబీఐకి అప్పస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నారాయణ వ్యాఖ్యలకు కోర్టు అవాక్కయింది. ప్రతివాదులకు నోటీసులు ఇవ్వకుండా, కౌంటర్లు కోరకుండా నేరుగా ఉత్తర్వులు జారీ చేయడం ఎలా? అంటూ ప్రశ్నించింది. లంచ్‌మోషన్‌గా కాకుండా సాధారణ పద్ధతిలోనే పిల్‌ను విచారిస్తామని తేల్చి చెప్పింది.