: ఇక్కడ పుట్టాము.. ఇక్కడ పెరిగాము.. ఇక్కడ తిరిగాము.. ఎప్పుడూ ఇలాగే వుండాలి!: వెంకయ్యనాయుడు


పాత రోజుల్లోనేమో కలిసి ఉంటే కలదు సుఖమని చెప్పే వాళ్లు, ఇప్పుడేమో విడిపోతే సుఖమని రెండు తెలుగు రాష్ట్రాలకు అర్థమవుతోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. తెలంగాణ పోస్టల్ సర్కిల్ ప్రారంభం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ‘రెండు తెలుగు రాష్ట్రాలు భౌతికంగా విడిపోయినా, మానసికంగా మనందరం ఒకటే. ఎందుకంటే, మనందరమూ తెలుగు వాళ్లమే. ఇక్కడ పుట్టాము.. ఇక్కడ పెరిగాము.. ఇక్కడ తిరిగాము. రాబోయే రోజుల్లో కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే, కలిసి కలహించుకోవడం కన్నా, విడిపోయి సహకరించుకోవడం మిన్న అని నేనెప్పుడూ చెబుతాను. ఇంతకు ముందేమో, కలిసి ఉంటే కలదు సుఖమని పాతరోజుల్లో చెప్పేవాళ్లు. ఇప్పుడేమో, విడిపోతే సుఖమని ఇద్దరికీ అర్థమవుతోంది. ఆ దిశలోనే ఇది నిజమని రుజువు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా ఉంది’ అని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News