: ఒక జీబీ ధరకే 10 జీబీలు వాడుకోండి... వొడాఫోన్ ఆఫర్
జియో విప్లవం ధాటికి డేటా టారిఫ్ లు అందుబాటులోకి వస్తున్నాయి. రిలయన్స్ సంస్థ ఎప్పుడైతే జియో ఆఫర్ ప్రకటించిందో అప్పటి నుంచి ఒకదాని తరువాత ఒకటిగా ఆఫర్లు ప్రకటిస్తూ, మొబైల్ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎయిర్ టెల్, ఆ తరువాత బీఎస్ఎన్ఎల్, ఇప్పుడు వొడాఫోన్ వరుసగా డేటా టారిఫ్ లను ప్రకటించాయి. తాజాగా వొడాఫోన్ ప్రకటించిన టారిఫ్ ప్రకారం ఒక జీబీ 4జీ డేటా ధరకు 10 జీబీ డేటా అందించనున్నారు. ఈ ఆఫర్ మూడు నెలల పాటు ఉంటుందని తెలిపింది. వొడాఫోన్ సూపర్ నెట్ వినియోగదారులు 1 జీబీ డేటాకు బిల్లు కడితే అదనంగా 9 జీబీ డేటా ఉచితంగా వస్తుందని చెప్పింది. కొత్త 4జీ హ్యాండ్ సెట్లతో ఇప్పుడు ఒక జీబీ ధరతో మూడు నెలల పాటు 10 జీబీ డేటా పొందవచ్చని వోడాఫోన్ ప్రకటన విడుదల జారీ చేసింది. వొడాఫోన్ సొంతంగా 3జీ, 4జీ సేవలు అందిస్తున్న సర్కిల్స్ ఈ ఆఫర్ ఉంటుందని తెలిపింది. డిసెంబర్ 16 వరకు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులు ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చని ఆ ప్రకటనలో వెల్లడించింది. తమ వినియోగదారులు 4జీ హ్యాండ్ సెట్లకు అప్ గ్రేడ్ కావాలన్న ఉద్దేశంతో ఈ ఆఫర్ ను తెచ్చినట్టు ఈ ప్రకటనలో పేర్కొంది.