: తలను తాకుతూ వెళ్లిన విమానం!
గత వారం అమెరికాలోని నెవెడాలో జరిగిన రెనో నేషనల్ ఛాంపియన్ షిప్ ఎయిర్ రేస్ లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. సెప్టెంబర్ 18న జరిగిన ఈ ఎయిర్ రేస్ లో థామస్ రిచర్డ్ అనే వ్యక్తి కూడా పాల్గొన్నాడు. అయితే, తన విమానం సాంకేతిక లోపం కారణంగా రన్ వేపై ఆగిపోయింది. అయితే, ఈ సమాచారం ఎయిర్ రేస్ లో పాల్గొన్న మరో పోటీదారుడికి అందలేదు. దీంతో, సదరు పోటీదారుడి విమానం, రన్ వేపై ఆగిపోయిన థామస్ విమానాన్ని ఒక పక్కకు ఢీ కొడుతూ, అతని తలపై తగులుకుంటూ వెళ్లింది. ఈ ఊహించని సంఘటనతో థామస్ షాక్ కు గురయ్యాడు. వెంటనే అక్కడున్న సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చి థామస్ ను బయటకు దింపారు. థామస్ చెయ్యికి గాయమైంది. కాగా, థామస్ విమానం కాక్ పిట్ లోని కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా ఈ విషయం బయటకు వచ్చింది. థామస్ ఈ వీడియోను యూట్యూబ్ లో పెట్టారు. వైరల్ గా మారిన ఈ వీడియోను ఇప్పటికే 19 లక్షల మందికి పైగా వీక్షించారు.