: ‘పాక్’పై ప్రతీకారం తీర్చుకోకుండా ప్రభుత్వం మాటలతో కాలక్షేపం చేస్తోంది!: శివసేన
జమ్మూకాశ్మీర్ లోని యూరీ సెక్టార్ లో జరిగిన దాడిపై ప్రతీకారం తీర్చుకోవాల్సింది పోయి కేవలం మాటలతో మన ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని శివసేన పార్టీ ఆరోపించింది. శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’లో ఈ మేరకు ఒక ఎడిటోరియల్ రాసింది. ‘యూరీ’ ఘటనలో మన సైనికుల ప్రాణాలు కోల్పోయినప్పటికీ మన ప్రభుత్వం తాము సాధించిన గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్ ను ఏకాకిని చేయాలని భారత్ చూస్తోంటే.. మన మిత్ర దేశమైన రష్యా, పాక్ సైనికులతో కలిసి జాయింట్ డ్రిల్ చేస్తోందని, ఇండోనేషియా సైనిక సామగ్రిని సమకూర్చిపెట్టే పనిలో ఉందని ఆ ఎడిటోరియల్ లో వ్యాఖ్యానించారు.