: అతనొస్తే క్లింటన్ ప్రియురాలిని చర్చకు తీసుకొస్తా: ట్రంప్ బెదిరింపులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వ్యక్తిగత విమర్శలు హద్దులు మీరుతున్నాయి. నేటి రాత్రి డెముక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తో జరగనున్న చర్చాగోష్ఠికి బిల్ క్లింటన్ మాజీ ప్రియురాలు జెన్నిఫర్ ఫ్లవర్స్ ను తీసుకువస్తానని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. నేటి రాత్రి తొలిసారిగా హిల్లరీ, ట్రంప్ ముఖాముఖి అధ్యక్ష అభ్యర్థుల చర్చాగోష్ఠిలో పాల్గొంటున్నారు. ఈ చర్చకు ‘డోపి’ మార్క్ కుబన్ ను హిల్లరీ ఆహ్వానించారని తెలిపిన ట్రంప్, తాను జెన్నిఫర్ ఫ్లవర్స్ ను తీసుకువస్తానని ట్వీట్ చేశారు. మార్క్ కుబన్ ముందు వరుసలో కూర్చుంటే అతని కుడివైపున జెన్నిఫర్ ఫ్లవర్స్ ను కూర్చోబెడతానని తెలిపారు. ట్రంప్ పై కుబన్ గతంలో చాలా సార్లు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మరోపక్క, జెన్నిఫర్ ఫ్లవర్స్ ఈ కార్యక్రమానికి తాను హాజరవుతానని తెలపగా, ఆమెను తాము ఆహ్వానించలేదని, ట్రంప్ అతిథిగా ఆమె రావాలని కోరుకోవడం లేదని ట్రంప్ ప్రచార మేనేజర్ తెలిపారు.