: అక్కడ నిమిషం విమాన ప్రయాణానికి 375 రూపాయలు!


నిమిషం విమాన ప్రయాణానికి 375.25 రూపాయలా? ఇదేం లెక్క అనిపించిందా? అవును నిజమే. అక్కడ విమాన ప్రయాణం కేవలం 13 మైళ్లు అంటే 20 కిలోమీటర్ల దూరమే ఉంది మరి. ఈ దూరాన్ని విమానంలో అధిగమించడానికి పట్టేది కేవలం 8 నిమిషాలు. ఆస్ట్రియాలోని వియన్నా విమాన సంస్థ స్విట్జర్లాండ్‌ లోని సెయింట్‌ గాలెన్‌ నుంచి జర్మనీలోని ఫ్రైడ్‌ రిచ్‌ సాఫెన్‌ మధ్య విమానం నడపనుంది. 50 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ విమానం ఈ రెండు నగరాల మధ్య వారంలో పదిసార్లు నడుస్తుంది. ఈ ఎనిమిది నిమిషాల ప్రయాణానికి 3002 రూపాయలు టికెట్ ధరగా ఈ విమానయాన సంస్థ నిర్ణయించింది. అంటే కిలో మీటర్ దూరానికి 150.10 రూపాయలు, నిమిషానికి 375.25 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీంతో అతితక్కువ దూరం విమానం ప్రయాణంగా ఇది చరిత్రకెక్కనుండగా, అతితక్కువ దూరం విమానం నడిపే సంస్థగా వియన్నా విమాన సంస్థ చరిత్రకెక్కనుంది.

  • Loading...

More Telugu News