: తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షసూచన


తెలుగు రాష్ట్రాల్లో మ‌రోసారి భారీవ‌ర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం విదర్భపై కేంద్రీకృత‌మై ఉందని, అది ఛత్తీస్‌గ‌ఢ్, మ‌ధ్యప్ర‌దేశ్ ల‌ను ఆనుకొని కొన‌సాగుతుంద‌ని పేర్కొన్నారు. వీటి ప్ర‌భావంతోనే కోస్తాంధ్ర‌లో మ‌రో మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. రాయ‌ల‌సీమ‌లోని ప‌లుచోట్ల జ‌ల్లులు కురిసే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. ఇక‌, తెలంగాణ‌లో మ‌రో 24 గంట‌ల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News