: ‘యూరీ’ సంఘటనపై స్పందిస్తాను.. పరిష్కారంపై మాత్రం కామెంట్ చేయలేను: విరాట్ కోహ్లీ


జమ్మూకాశ్మీర్ లోని యూరీ సెక్టార్ పై జరిగిన సంఘటనపై మాత్రమే తాను స్పందించగలను కానీ, దాని పరిష్కారంపై మాత్రం కామెంట్ చేయలేనని టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. న్యూజిలాండ్ జట్టుపై చారిత్రక 500వ టెస్ట్ మ్యాచ్ విజయం అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ‘యూరీ’ సంఘటనపై స్పందించాలని విలేకర్లు కోరగా పైవిధంగా వ్యాఖ్యానించాడు. యూరీ సంఘటనకు సంబంధించిన పరిష్కారంపై కామెంట్ చేసే స్థాయిలో తాను లేనని చెప్పాడు. ఒక భారతీయుడిగా తాను వీర జవాన్ల కుటుంబాలకు తన సంతాపం మాత్రమే తెలియజేయగలనని, ఇలాంటి సంఘటనలు జరగడంపై ఒక భారతీయుడిగా ఎంతో ఆవేదన చెందుతున్నానని కోహ్లీ తన బాధ వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News