: జాతి వైరం వీడి కలసిమెలసి తిరుగుతున్న కోతిపిల్ల, కుక్క
రెండూ మూగ జీవులే.. అందులోనూ జాతి వైరం ఉన్న జంతువులు. అయినా కలసిమెలసి జీవిస్తున్నాయి. ఒకదాన్ని విడిచి మరొకటి వీడనంటోంది. విజయనగరం జిల్లాలోని గుమ్మ లక్ష్మీపురంలో ఓ కోతిపిల్ల, కుక్క స్నేహితుల్లా కలసిమెలిసి తిరుగుతున్నాయి. ఆహారాన్ని సేకరించుకొని ఒకదానికొకటి పంచుకొని తింటున్నాయి. కోతిపిల్లకి శునకం స్నేహితుడిలా ఉండడమే కాకుండా తల్లిగా సేవ చేస్తోంది. కుక్కపైకి ఎక్కుతున్న కోతిపిల్ల తల్లి ఒడిలో ఉన్నట్టుగా హాయిగా నిద్రపోతోంది. గ్రామానికే ప్రత్యేక ఆకర్షణలా మారిన ఈ కోతిపిల్ల, కుక్కలను ఆ గ్రామానికి వచ్చిన కొత్తవారు చూడకుండా వెళ్లడం లేదు.