: నకిలీ విత్తనాలు అమ్మిన దుకాణాలపై రైతుల దాడి
వ్యవసాయం కోసం అప్పుచేసి విత్తనాలు కొందామని వెళ్లిన మిరప రైతులకు దుకాణదారులు నకిలీ విత్తనాలు అంటగట్టారు. విషయాన్ని తెలుసుకున్న రైతులు తమకు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, ఖమ్మంలోని గాంధీచౌక్‌లో వారు ఆందోళనకు దిగారు. తమకు నకిలీ విత్తనాలు అమ్మిన దుకాణాలపై దాడి చేశారు. అనంతరం అక్కడి సూర్యపేట రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఆ రోడ్డుగుండా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అక్కడకు చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.