: కెనడా ప్రధానికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ససేమిరా అన్న బుల్లి యువరాజ్


విహార యాత్ర నిమిత్తం బ్రిటన్ ప్రిన్స్ విలియమ్- కేట్ దంపతులు తమ పిల్లలు జార్జ్, చార్లెట్ తో కలిసి నిన్న కెనడాకు వెళ్లారు. ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికేందుకు బ్రిటిష్ కొలంబియా విమానాశ్రయానికి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో వెళ్లారు. విలియమ్ దంపతులకు సాదర స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే బుల్లి యువరాజ్ జార్జ్ ను ఆకట్టుకునేందుకు ట్రుడో షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే, ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు మాత్రం బుల్లి యువరాజ్ తిరస్కరించాడు. ట్రుడో ఎన్నిసార్లు ప్రయత్నించినా జార్జ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా, బుల్లి యువరాజ్ జార్జ్ ఈ విధంగా చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో ఒకసారి అమెరికా అధ్యక్షుడు ఒబామా కలిసినప్పుడు కూడా జార్జ్ వార్తల్లో నిలిచాడు. నాడు పైజామా ధరించిన జార్జ్, ఒబామాను విష్ చేశాడు.

  • Loading...

More Telugu News