: స్టాక్ మార్కెట్ భారీ నష్టంలో ఉన్న వేళ, ఏడేళ్ల గరిష్ఠానికి రిలయన్స్


ప్రపంచంలోని టాప్ టెన్ చమురు కంపెనీల జాబితాలో భారత అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ 8వ స్థానంలో ఉండటం, రిలయన్స్ జియో లాంచింగ్ తరువాత ఇన్వెస్టర్లలో పెరిగిన సెంటిమెంట్ ఊతంగా ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతూ వస్తున్న సంస్థ ఈక్విటీ విలువ నేడు ఏకంగా ఏడేళ్ల గరిష్ఠానికి చేరింది. ఓ వైపు సెన్సెక్స్, నిఫ్టీలు ఒక శాతం కన్నా నష్టాల్లో సాగుతుంటే, రిలయన్స్ ఈక్విటీ రూ. 1111 వద్ద కొనసాగుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది 0.8 శాతం లాభం కాగా, ఒక దశలో ఈక్విటీ వాల్యూ రూ. 1,130 దాటింది. గడచిన 14 సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీల పయనంతో సంబంధం లేకుండా వరుసగా 10 సెషన్లలో రిలయన్స్ లాభాల్లో నడిచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News