: యూపీలో రాహుల్ గాంధీకి చేదు అనుభవం.. రాహుల్ పై షూ విసిరిన వ్యక్తి

వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు విజయం సాధించిపెట్టడమే లక్ష్యంగా ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తోన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఈ రోజు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తోన్న ఆయన ఈరోజు సీతాపూర్‌లో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో రోడ్ షోకి వచ్చిన ఓ దుండగుడు ఆయనపై షూ విసిరాడు. దీంతో రోడ్ షోలో కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. షూ విసిరిన వ్యక్తిని వెంటనే పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అనంతరం మళ్లీ రాహుల్ గాంధీ తన రోడ్ షోను కొనసాగించారు.