: వ్యవసాయంలో తలెత్తే ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనాలి: సీఎం చంద్రబాబు


వ్యవసాయంలో తలెత్తే ప్రతి సమస్యకు శాస్త్రవేత్తలు పరిష్కారం కనుగొనాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 48వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, దేశంలో ప్రస్తుతం వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, రైతన్న ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయరంగంలో వినూత్న మార్పులు తీసుకురావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా మారడానికి నాడు కాటన్ దొర చేసిన కృషి ఎంతో ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు.

  • Loading...

More Telugu News