: హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రిలో వందల సంఖ్యలో బారులు తీరిన రోగులు.. 15 డెంగ్యూ కేసులు నమోదు
హైదరాబాదీయులను విషజ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. దీంతో నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రి రోగులతో కిక్కిరిసిపోతోంది. ఆసుపత్రి ఆవరణలో వందల సంఖ్యలో రోగులు బారులు తీరి కనిపిస్తున్నారు. కేవలం ఏడు రోజుల్లోనే ఓపీ కేసులు 9 వేలకు చేరాయి. గంటల తరబడి క్యూలో నిలబడి రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటి వరకు ఆసుపత్రిలో 15 డెంగ్యూ కేసులు నమోదయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లో పడుతున్న వర్షాల కారణంగా వ్యాధులు విజృంభిస్తున్నాయని తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.