: నయీమ్ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు 126 ఫిర్యాదుల నమోదు.. 93 మంది అరెస్టు


ఇటీవ‌లే తెలంగాణ పోలీసుల చేతిలో హ‌త‌మైన గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీమ్ కేసులో విచార‌ణ ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. సిట్ అధికారులు న‌యీమ్ అనుచ‌రుల‌ను, కేసులో సంబంధం ఉన్న వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈరోజు మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌కు చెందిన బ‌త్తుల ఈశ్వ‌ర‌య్యను సిట్ అధికారులు అరెస్టు చేశారు. రెండు, మూడు రోజుల్లో మ‌రిన్ని అరెస్టులు చేస్తామ‌ని ఈ సందర్భంగా అధికారులు మీడియాకు తెలిపారు. నయీమ్ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు 126 ఫిర్యాదులు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు జ‌రుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 93 మందిని అరెస్టు చేసిన‌ట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News