: విజయవాడ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో పీవీ సింధు
భారత బ్యాట్మింటన్ స్టార్, తెలుగుతేజం పీవీ సింధు రియో ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన తరువాత రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆలయాలను దర్శించుకుంటూ కనిపిస్తోంది. ఈ రోజు కూడా ఆమె తమ తల్లిదండ్రులు విజయ, రమణ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంది. సింధు కుటుంబ సభ్యులకు స్వాగతం పలికిన దేవాలయ అధికారులు.. పూజలు నిర్వహించిన అనంతరం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా కనకదుర్గమ్మ చిత్రపటాన్ని సింధుకి ప్రదానం చేశారు.