: అడవిలోంచి సింగిల్‌గా వచ్చి గ్రామస్తులను హడలెత్తిస్తోన్న గజరాజు.. ఒకరి మృతి
చిత్తూరు జిల్లా రామసముద్రం మండలంలో ఓ గజరాజు హల్‌చల్ చేస్తోంది. మండలంలోని పలు గ్రామాల్లో ఇష్టం వచ్చినట్లు తిరుగుతోంది. ఏనుగు తమపై దాడి చేస్తుందనే భయంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న అడవుల నుంచి ఆ గజరాజు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రోజు వెంకటరమణ అనే రైతుపై ఈ ఏనుగు దాడిచేయడంతో ఆయన మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఏనుగును అటవీప్రాంతంలోకి పంపేందుకు నానా అవస్థలూ పడుతున్నారు. జనం ఏనుగు వెంటపడుతున్నారని, తాము దాన్ని అడవుల్లోకి పంపేందుకు వారు సహకరించడం లేదని అధికారులు ఆరోపిస్తున్నారు. గజరాజును గ్రామస్తులు తరిమికొడుతున్న సమయంలోనే అది వెంకటరమణను తొక్కేసిందని, ఆ కారణంగానే చనిపోయాడని చెబుతున్నారు.