: 500వ టెస్ట్ మనదే... చారిత్రాత్మక టెస్టులో భారత్ ఘన విజయం
టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ ఆడుతున్న ప్రతిష్ఠాత్మక 500వ టెస్టులో ఘనవిజయం సాధించింది. అభిమానులకు గుర్తుండిపోయే క్షణాలను అందించింది. కాన్పూర్ లో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు 197 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 87.3 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో మైదానంలో కోహ్లీ సేన సంబరాలు చేసుకుంది. ఆటగాళ్లు ఒకరిని ఒకరు అభినందించుకున్నారు. కాగా, ఇండియా ఆడిన 500 టెస్టుల్లో ఇది 130వ విజయం. భారత్ లో 88వ విజయం కాగా, న్యూజిలాండ్ పై 19వ విజయం.