: విజయానికి ఒక్క వికెట్ దూరంలో భారత్
కాన్పూర్ వేదికగా కొనసాగుతున్న చారిత్రక 500వ టెస్టులో భారత్ గెలుపు దాదాపు ఖాయమైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టులో 434 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ ఆటగాళ్లు విఫలమవుతున్నారు. ఆ జట్టు ప్రస్తుతం తొమ్మిదో వికెట్‌ను కోల్పోయి ఓటమి అంచున ఉంది. భారత్ గెలుపునకు మరో వికెట్ దూరంలో ఉంది. టెస్టుల్లో 19వ సారి అశ్విన్ 5 వికెట్లు తీశాడు.