: కావేరీ జలాల వివాదం: మరోసారి సుప్రీంకు కర్ణాట‌క


కావేరి జ‌లాల వివాదంపై ఇటీవ‌లే విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు క‌ర్ణాట‌కకు షాకిచ్చే తీర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే, సుప్రీం ఇచ్చిన తీర్పును పాటించ‌డానికి క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం వెన‌కాడుతోంది. రాష్ట్ర ప్ర‌జ‌లు, రైతుల నుంచి వ్య‌క్తమ‌వుతున్న నిర‌స‌న‌ల‌తో చిక్కుల్లో ప‌డ్డ ఆ రాష్ట్ర స‌ర్కార్ సుప్రీంకోర్టు త‌మ తీర్పుని పునఃస‌మీక్షించాల‌ని మ‌రోసారి న్యాయ‌స్థానంలో పిటిష‌న్ వేసింది. ఈ అంశంపై ఈరోజు విచార‌ణ జరుపుతున్న సుప్రీంకి, డిసెంబ‌రు వ‌ర‌కు త‌మిళ‌నాడుకి తాము కావేరీ జ‌లాల‌ను విడుద‌ల చేయ‌బోమ‌ని కర్ణాటక తరఫు న్యాయవాదులు తెలిపినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల వాద‌న‌లు వింటున్న సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణ‌యాన్ని వెల్ల‌డిస్తోంద‌నే అంశంపై ఇరు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెల‌కొంది.

  • Loading...

More Telugu News