: ఏపీలో ఇంటికో వాహనం: సమాచార శాఖ ఆసక్తికర లెక్కలు


ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంటికీ ఓ మోటారు వాహనం ఉందని సమాచార శాఖ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. విజయవాడను హరితవనం చేస్తామని చెబుతూ విడుదల చేసిన ప్రచార పత్రికలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలుండగా, 92 లక్షల వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయని, సగటున కుటుంబానికో వాహనం ఉందని తెలిపింది. గత సంవత్సరం 3.80 లక్షల వాహనాల రిజిస్ట్రేషన్ జరిగితే, ఈ ఏడు తొలి 8 నెలల్లోనే 4.80 లక్షల వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయని పేర్కొంది. రాజధాని అమరావతి ప్రాంతంలో 12 లక్షల వాహనాలున్నాయని చెప్పింది. రాజధాని వాసులు వాహన కొనుగోళ్లలో ముందున్నారని, కృష్ణాజిల్లాలో ఈ సంవత్సరం 57 వేలకు పైగా వాహనాలు రిజిస్టరైనట్టు పేర్కొంది. ఈ లెక్కన చూస్తే, జనవరి 2017 నాటికి రాష్ట్రంలో వాహనాల సంఖ్య కోటిని దాటుతుందని రవాణా రంగ నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News