: సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేకు ఏటీసీ బ్రేక్.. రోడ్డు మార్గంలో వెళుతున్న ముఖ్యమంత్రి
వర్షం కారణంగా ఏర్పడిన వరద పరిస్థితులను పరిశీలించడానికి ఈరోజు కరీంనగర్ లో ఏరియల్ సర్వే చేపట్టాలని అనుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి ఏటీసీ బ్రేక్ వేసింది. వాతావరణం సరిగా లేకపోవడంతో ఏరియల్ సర్వేకు అనుమతి నిరాకరించింది. దీంతో రోడ్డు మార్గంలోనే కరీంనగర్ జిల్లాలో పర్యటించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో ఆయన జిల్లాకు చేరుకోనున్నారు. ముందుగా కరీంనగర్‌లో మంత్రులు, అధికారులతో గోదావరి వరద పరిస్థితి గురించి ఆయన చర్చించనున్నారు. అనంతరం ఆయన మిడ్ మానేరును పరిశీలించనున్నారు. తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ ఇప్పటికే ఆ జిల్లాలో పర్యటిస్తున్నారు.