: తెలుగు రాష్ట్రాల రైతులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
తెలుగు రాష్ట్రాల రైతులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు. హైదరాబాద్ నుంచి రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రైతులు తాము ఎదుర్కొంటున్న కష్టాలు, వారు అవలంబించాలనుకుంటున్న నూతన పద్ధతులపై మోదీకి వివరిస్తున్నారు. కొత్త వంగడాలు అందిస్తే దిగుబడులు సాధిస్తామని ప్రధానిని ఓ రైతు కోరారు. తమకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలని అన్నారు. పత్తి, జొన్న, మొక్కజొన్న పంటలు సాగుచేసి నష్టపోయినట్లు కర్నూలు జిల్లాకు చెందిన రైతు మోదీకి వివరించారు. శాస్త్రవేత్తల సూచనల మేరకు అశ్వగంధ ఔషధ పంట సాగుచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ పంటను మధ్యప్రదేశ్‌లో మార్కెట్ చేస్తున్నట్లు తెలిపారు.