: జర్మనీలో టేకాఫ్ అయిన 8 నిమిషాల్లో స్విట్జర్లాండ్ లో దిగే విమానం... గిన్నిస్ రికార్డు!
ఇంటర్నేషనల్ విమాన సర్వీసులందించే సంస్థ 'పీపుల్ వీనలైన్' గిన్నిస్ రికార్డును సృష్టించనుంది. ప్రపంచంలోనే అతి తక్కువ దూరాన్ని ప్రయాణించి రెండు వేర్వేరు దేశాల్లోని రెండు నగరాల మధ్య విమానాలు నడపడమే పీపుల్ వీనలైన్ ప్రత్యేకత. జర్మనీలోని ఫ్రీడ్ రిచ్ షఫీన్ నుంచి స్విట్జర్లాండ్ లోని సెయింట్ గాలెన్ మధ్య ఇది నడవనుంది. ఈ రెండు నగరాల మధ్య దూరం 13 మైళ్లు మాత్రమే కాగా, వీటిని కాన్ స్టాన్స్ నది వేరు చేస్తుంది. కేవలం 8 నిమిషాల్లో ప్రయాణం పూర్తవుతుంది. నవంబర్ 2 నుంచి విమాన సేవలు ప్రారంభం కానుండగా, టికెట్ ధర 45 డాలర్లని పీపుల్ వీనలైన్ ప్రతినిధి తెలిపారు. విమాన సేవలు మొదలైతే, అతి తక్కువ దూరం ప్రయాణించి రెండు దేశాల మధ్య తిరిగే విమానంగా ఇది గిన్నిస్ రికార్డులకు ఎక్కనుంది.