: 'పదేళ్ల క్రితం మా నాన్నను ఇక్కడే చంపారు సార్'... అని బాలికలు చెబితే దిగ్భ్రాంతికి లోనైన చంద్రబాబు

"మీకు గుర్తుందా సార్... మా నాన్న బోయ వెంకటరెడ్డి, ఆయన్ను, మిట్టగుడిపాడు సర్పంచ్ గొట్టం రామకోటిరెడ్డిని ఇక్కడే వేట కొడవళ్లు, గొడ్డళ్లతో దారి కాచి చంపారు సార్" అని బోయ వెంకటరెడ్డి కుమార్తెలు శ్రీలత, పద్మలు, దాదాపు 17 ఏళ్ల తరువాత తమ ఊరికి వచ్చిన సీఎం చంద్రబాబుకు చెబుతుంటే, ఆయన ఒక్క క్షణం దిగ్భ్రాంతికి గురయ్యారు. 2006లో జూన్ 9వ తేదీన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరై రెంటచింతలకు వస్తున్న వీరిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. అనంతరం తమ తల్లి కూలిపనులు చేసి చదివించిందని, ఎమ్మెల్యే యరపతినేని ఆదుకోకుంటే వీధుల్లో పడుండేవాళ్లమని వారు వాపోయారు. "ఇప్పుడు ఏం చేస్తున్నావమ్మా?" అని చంద్రబాబు అడుగగా, మోడల్ స్కూల్లో తాత్కాలిక పద్ధతిలో తను, ఫిషరీస్ డిపార్ట్ మెంట్ లో చెల్లెలు పనిచేస్తున్నామని శ్రీలత చెప్పడంతో, ప్రయోజకులైనందుకు సంతోషంగా ఉందని, మీ కుటుంబాన్ని తప్పక ఆదుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లారు.

More Telugu News