: గురుగ్రామ్‌లో ఆపరేషన్ ‘రోమియో ఫ్రీ’.. 76 మందికి సంకెళ్లు
మహిళల వెంటపడి వేధించే ఆకతాయిల పని పట్టేందుకు హర్యాణాలోని గురుగ్రామ్‌లో పోలీసులు నిర్వహించిన ‘రోమియో ఫ్రీ’ ఆపరేషన్‌లో పలువురు జులాయిలు పట్టుబడ్డారు. ఆదివారం రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున రెండు గంటల వరకు నిర్వహించిన ఆపరేషన్‌లో మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, అసభ్య పదజాలంతో హింసిస్తున్న 76 మందిని అదుపులోకి తీసుకున్నట్టు గురుగ్రామ్ పోలీసులు తెలిపారు. పోలీస్ కమిషనర్ సందీప్ ఖిర్వార్ ఆధ్వర్యంలో రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా పబ్బులు మూసివేసి ఒంటిగంట ప్రాంతంలో ‘రోమియో’లను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. వీరంతా బార్ గర్ల్స్, బార్లలోకి వచ్చేవారి పట్ల దురుసుగా ప్రవర్తించే వారని పేర్కొనారు. ఈరోజు వీరిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.