: నా దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది... అవసరమైతే తీస్తా: వైఎస్ జగన్


రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పోరాడుతున్న తన వద్ద ఓ బ్రహ్మాస్త్రముందని, అవసరమైతే దాన్ని బయటకు తీస్తానని వైకాపా అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్య చేశారు. గత రాత్రి వివిధ దేశాలకు చెందిన ప్రవాస భారతీయులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, హోదాపై పోరులో తుది అస్త్రంగా ఎంపీలతో రాజీనామా చేయిస్తామని అన్నారు. తెలుగుదేశం అందుకు సిద్ధమంటే, ఇప్పుడే రాజీనామాలకు చేసి వెళ్దామని చెప్పారు. హోదా కోసం పోరులో ఎవరు కలిసొచ్చినా తమకు అభ్యంతరం లేదని, పార్లమెంటు వేదికగా పోరాడాల్సింది ఎంపీలే కాబట్టి, చిట్ట చివర రాజీనామాలు చేయిస్తానని వెల్లడించారు. ఏపీకి హోదా వస్తే పిల్లలు ఉద్యోగం కోసం కర్ణాటకకో, తమిళనాడుకో వెళ్లాల్సిన అవసరం ఉండదని, ఆదాయపు పన్ను మినహాయింపు, రవాణా రంగాల్లో రాయితీలు, ఎక్సైజ్ సుంకాల రద్దు వంటి అంశాలతో ఇప్పుడు తనతో మాట్లాడుతున్న ఎన్నారైల్లోని ఎందరో వచ్చి పెట్టుబడులు పెడతారని చెప్పుకొచ్చిన జగన్, ఆపై ప్రతి జిల్లా హైదరాబాద్ గా మారుతుందని అన్నారు. ప్యాకేజీతో ఒక్క పరిశ్రమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అని వెంకయ్యను ప్రశ్నించిన జగన్, ప్రస్తుతానికి ఏపీ పక్క రాష్ట్రాలతో పోటీ పడే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News