: ముంపు గ్రామాల్లో తెలంగాణ మంత్రులు.. అర్ధరాత్రి నుంచి కట్టపైనే హరీష్, ఈటల
కరీంనగర్ జిల్లా మిడ్‌మానేరుకు వరదనీరు నిలకడగా చేరుతోంది. వరద నిలకడగా ఉండడంతో ప్రమాదమేమీ లేదని మంత్రులు, అధికారులు చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా మన్వాడ్, మల్లాపూర్, కట్కూర్, కొదురుపాక గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. ముంపు గ్రామాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్ అర్ధరాత్రి నుంచి కట్టపైనే ఉండి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే మంత్రులు ముంపు గ్రామాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.