: భాగ్యనగరంలో హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఢిల్లీ యువతులు
భాగ్యనగరంలో మరో హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు అయింది. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులకు వ్యభిచార నిర్వాహకులు పట్టుబడ్డారు. రామాంతపూర్‌లో గత కొంతకాలంగా హైటెక్ పద్ధతుల్లో వ్యభిచారం నడుస్తోందంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఎస్‌వోటీ పోలీసులు పక్కా సమాచారంతో వ్యభిచార గృహంపై దాడిచేశారు. ఢిల్లీ యువతులను హైదరాబాద్ తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న రంజిత్ సహా ఇద్దరు మహిళలు, ముగ్గురు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు.