: తప్పుడు పనులు, వ్యాపారాలు చేసి రాజకీయాల్లోకి వస్తారు.. వాళ్లకు నేను భయపడతానా?: చంద్రబాబు
కొందరు తప్పుడు పనులు చేసి, వ్యాపారాలు చేసి రాజకీయాల్లోకి వస్తున్నారని, ఆపై బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అటువంటి వారికి తాను భయపడే రకం కాదని తేల్చి చెప్పారు. ఉగ్రవాద పార్టీలను నమ్మొద్దని, వాటితో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రాన్ని పాలించే హక్కు, ప్రజలను ఆదుకునే బాధ్యత ఒక్క టీడీపీ ప్రభుత్వానికే ఉందని పేర్కొన్నారు. దాచేపల్లి మెయిన్ సెంటర్లో ఆదివారం జరిగిన సభలో మాట్లాడిన చంద్రబాబు పై విధంగా వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం లాంటి పార్టీలను నమ్ముకుని ముందుకెళితే మునగడం ఖాయమని హెచ్చరించారు. ప్రజలు, రైతులు, అన్ని వర్గాల మేలు కోరేది తమ ప్రభుత్వమేనని సీఎం చంద్రబాబు నొక్కి చెప్పారు.