: 17 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రెంటచింతలకు చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సరిగ్గా 17 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మరోమారు గుంటూరు జిల్లాలోని రెంటచింతల వచ్చారు. సెప్టెంబరు, 1999లో సీఎంగా ఉన్న బాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా రెంటచింతల వచ్చి యరపతినేని తరపున ప్రచారం చేశారు. ఆ తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ చంద్రబాబు రెంటచింతల వచ్చారు. ఆదివారం గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రి వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పైర్లను పరిశీలించి రైతుల్లో ధైర్యం నూరిపోశారు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చంద్రబాబు రాకతో రెంటచింతల వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.