: అబద్ధాలు చెప్పే వెంకయ్య నోటిని ఫినాయిల్‌తో కడగాలి.. విరుచుకుపడిన సీపీఐ నారాయణ
ప్రత్యేక హోదాపై అబద్ధాలు చెబుతున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి నోటిని ఫినాయిల్‌తో కడిగి శుభ్రం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. విజయవాడలోని నిమ్మతోట సెంటర్లో ఆ పార్టీ నగరశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపై ఆదివారం నిర్వహించిన ప్రజాబ్యాలెట్‌కు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ వెంకయ్యనాయుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హోదాపై ఆయన పూర్తిగా అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ఇరత రాష్ట్రాలు ఒప్పుకోకపోవడం వల్లే హోదా ఇవ్వడం లేదని చెబుతున్న వెంకయ్య, ప్రధాని మోదీతో కలిసి జీఎస్టీ బిల్లును ఎలా ఆమోదింపజేసుకున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా రాష్ట్రానికి ఇవ్వాల్సినవి కాకుండా అదనంగా మరో రూ.2.25 లక్షల కోట్లు ఇస్తే ప్రజలందరూ సంతోషిస్తారని నారాయణ అన్నారు.